నైరుతి ఆగమనం.. ఒకటి రెండు రోజుల్లో ఏపీకి!
- ముందుగా రాయలసీమను తాకనున్నట్లు అంచనా
- ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు
- ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గుతాయని ఐఎండీ నివేదిక
దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు భారత ప్రధాన భూభాగంలోకి ప్రవేశించాయి. జూన్ 4వ తేదీన ఇవి కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం రుతుపవనాల కదలిక చురుగ్గా ఉందని, శనివారం నుంచి సోమవారం లోపు ఇవి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
సాధారణంగా జూన్ 1న కేరళలోకి ప్రవేశించాల్సిన రుతుపవనాలు, ఈసారి మూడు రోజులు ఆలస్యంగా వచ్చాయి. ఇప్పటికే కేరళతో పాటు కర్ణాటక, తమిళనాడు, గోవాలోని కొన్ని ప్రాంతాలకు ఇవి విస్తరించగా, అక్కడ వర్షాలు కురుస్తున్నాయి. అమరావతి వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం.. జూన్ 6 నుంచి 8 మధ్య రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఒకవేళ వాతావరణ పరిస్థితులు అనుకూలించని పక్షంలో వారం రోజుల వరకు ఆలస్యం కావచ్చని అధికారులు తెలిపారు. అయితే, ఈ నెల 10వ తేదీ నాటికి ఇవి రాష్ట్రాన్ని తాకి, 15వ తేదీ నాటికి రాష్ట్రమంతటా విస్తరిస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథకుమార్ పేర్కొన్నారు.